పల్లవి:
పెదవుల్లో దాగున్న నీ నవ్వే చూడాలని వేచింది సూర్యోదయం,,,
గుండెల్లో మోస్తున్న ఆ బాధే మరవాలని కోరింది ఆ ఆకాశం,,,
శిల అయినా ఉలి గాయం తోనే అవుతుంది శిల్పం,,,
కల అయినా కష్టాలే లేక అవ్వదుగా సత్యం,,,
బ్రతుకంటే సుఖమే కలకాలం ఉండదుగా నేస్తం,,,
గెలుపైనా ఓటమి రాకుంటే కోల్పోవును అర్థం,,,
జీవితమే ఒడిదొడుకుల చక్రం,,
జీవిస్తే నిన్నే వరించును విజయం,,,
చర:1
తడి ఆరని కళ్ళల్లో కన్నీరుల జలపాతం,ఆగాలి ఆగని ఈ కాలం కోసం,,
తుడిచేసిన స్వప్నాలే బాధించిన ప్రతి నిమిషం,వదలకు ఓ నేస్తం నీ మార్గం,,
మొలకెత్తే మొక్క అయిన అవ్వాలి ఎన్నటికైన ఒక వృక్షం,,,
పరిగెత్తే నది అయినా చేరాలి చివరికి సంద్రం,,
నీ గెలుపుకి గాయం ఒక అస్త్రం,,
వెనకడుగేయక సాధించు లక్ష్యం,,
చర:2
విధి ఆడిన ఆటల్లో ఒక ఆటే నీ జీవితం,పోరాడి చూపించు నీ ధైర్యం,,
మది కోరిన ఆశల్లో ఆశించకు ఏ ఫలితం,ఆచరనే చూపిస్తే ఏదైనా సొంతం,,
పడి లేచే కెరటం చేరునుగా ఎప్పటికైనా తీరం,,
పడిపోతున్నా రవికిరణం పంచునుగా వెలుగును నిత్యం,,
ఎదురైనా ఎంతటి కష్టం,,
ఎదిరిస్తే నీ గెలుపే తధ్యం,,
Friday, 18 June 2010
!!"కష్టం భరిస్తే విజయం వరిస్తుంది,,"!!
08:53
QUOTE
Contact us
<<===POST YOUR COMMENTS HERE & MENTION THE POST LINK===>>
foxyform